telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

చివరి క్షణంలో యువకుడి ప్రాణాలు కాపాడిన ఐఫోన్… !!

Car

గేల్ సాల్సెడో (18) అనే యువకుడు అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని మేసన్ సిటీలో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం గేల్ తన కారులో కాలేజ్‌కు వెళ్తుండగా.. దారి మొత్తం మంచుతో కప్పేసి ఉంది. దీంతో గేల్ కారు మంచును ఢీకొట్టడంతో.. కారు రూట్ మారి పక్కనే ఉన్న విన్నెబాగో నదిలోకి వెళ్లిపోయింది. కారు నదిలో పడిపోయిన వెంటనే గేల్ తన కారు అద్దాలు దించి ఫోన్ కోసం వెతికాడు. అయితే ఫోన్ కారులో ఎక్కడ పడిపోయిందో కనిపించలేదు. కారులో నిండుగా నీరు వచ్చేయడంతో.. ఇక తాను బతకడం కష్టమేననుకున్నాడు. చివరిగా ప్రాణాలపై ఆశతో ఒక్కసారి.. ‘సిరి.. కాల్ 911’ అంటూ గట్టిగా అరిచాడు. అమెరికాలో 911 అనేది ఎమర్జెన్సీ నెంబర్. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటారు. మరోపక్క ఐఫోన్‌లో సిరి అనేది ఇంటెలిజెంట్ అసిస్టెంట్. దీనిద్వారా వాయిస్ కమాండ్‌తోనే నచ్చిన వారికి ఫోన్ చేయడం నుంచి అనేక పనులు చేయవచ్చు. కాగా, గేల్ అరిచిన శబ్దానికి తన కారులో ఓ మూలన పడిపోయిన ఐఫోన్ నుంచి 911కి ఫోన్ వెళ్లింది. అంతే.. నిమిషాల్లో ఆ వంతెన దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. నదిలో గేల్ కారు కనిపించడంతో.. రెస్క్యూ సిబ్బంది అతికష్టం మీద గేల్‌ను ప్రాణాలతో కాపాడారు. తాను బతుకుతాననే ఆశ కూడా పోయిందని.. అయితే తన ఐఫోన్ తనకు తిరిగి ప్రాణాలను ఇచ్చిందని గేల్ ఆనందం వ్యక్తం చేశాడు.

Related posts