telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘చావు కబురు చల్లగా’ టీజర్‌ అప్డేట్‌ ఇదే..

యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం”చావు కబురు చల్లగా”. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసింది చిత్రయూనిట్. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా “చావు కబురు చల్లగా” టీజర్ ను ఇటీవల విడుదల చేసారు. ఈ సినిమాలో శవాలను శ్మశానానికి తీసుకెళ్లే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నాడు. ‘చావు కబురు చల్లగా’లో ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ గ్లిప్స్‌ రిలీజ్‌ డేట్‌ను ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ చెప్పేసింది. ఈ టీజర్‌ ఎల్లుండి అంటే ఈ నెల 11న 10:56 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది సినిమా యూనిట్. ఈ టీజర్‌ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts