telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టుకు గట్టిషాక్… రెండోసారి…?

భారత జట్టుకు గట్టిషాక్ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఆఖరిదైన 5వ టీ20లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్యలు తీసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ భారీ జరిమానా విధించాడు. చివరి మ్యాచ్‌లో భారత జట్టు నిర్దిష్ట సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఈ తప్పిదాన్ని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించడంతో పాటు పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఎలాంటి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇక ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. అయితే గత ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ భారత్ నిర్థిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేయడంతో 20 శాతం కోత విధించారు. ఇక నాలుగో టీ20లో ఒక ఓవర్ తక్కువగా వేసిన ఇంగ్లండ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా కోత పడింది.

Related posts