telugu navyamedia
రాజకీయ వార్తలు

మమత సర్కారుకు మరో సమస్య .. సమ్మె బాటలో టీచర్లు!

BJP compliant EC West Bengal

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది. ముఖ్యమంత్రితో సోమవారం సాయంత్రం జరిగిన చర్చలు సఫలం కావడంతో వారం రోజులుగా జరుగుతున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు విరమించారు. ఆ వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ టీచర్లు ఆందోళన చేపట్టారు. గత ఎనిమిదేళ్లుగా వేతనాలు పెరగలేదని, విద్యార్హతల ఆధారంగా వేతనాలు పెంచాలని సమ్మేకు దిగారు.

వేతనాలు పెంచాలంటూ వికాశ్ భవన్‌గా ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషన్ సెక్రటేరియట్‌ను ఉపాధ్యాయులు ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్‌కే), మాధ్యమిక శిక్షణ కేంద్ర టీచర్లు-పోలీసుల మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఉపాధ్యాయులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వికాశ్ భవన్‌లోని బెంగాల్ విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Related posts