telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : … పాత జిల్లాల ప్రకారమే .. ఉపాధ్యాయులకు పదోన్నతులు..

funds to telangana by central govt

ఇప్పటికే ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు పదోన్నతుల ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తయారుచేయగా, ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించారు. పదోన్నతులను పాతజిల్లాల ప్రకారమే చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై హైకోర్టులో ఉన్న కేసుకు తక్షణమే పరిష్కారమయ్యేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుల వరకే పదోన్నతులు కల్పిస్తున్నామని, దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయుల పోస్టు జోనల్ క్యాడర్‌కు సంబంధించినవి. ప్రస్తుతం జోనల్ వ్యవస్థలపై స్పష్టత లేదు. దీంతో పాత జిల్లాలవారీగా పదోన్నతులు కల్పిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాల్లేవు.

అంతర్‌జిల్లా భార్యాభర్తల బదిలీలు 33 జిల్లాల వారీగా పదోన్నతులు కల్పించాలంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారని..దీనివల్ల సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. కొత్త జిల్లాలవారీగా పదోన్నతుల్లో ఎదురయ్యే సమస్యలను వివరించి.. కోర్టు ఆమోదంతో పాతజిల్లాల వారీగా ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేస్తున్నారు. యాజమాన్యాలవారీగా పదోన్నతులకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంగీకరించారు. అం తర్‌జిల్లా భార్యాభర్తల బదిలీలు కూడా చేపట్టడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ బదిలీల కోసం దాదాపు వెయ్యిమంది ఎదురుచూస్తున్నారని చెప్పారు.

Related posts