telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ వాడితే కఠిన చర్యలు!

Mobile phones class room

క్లాస్ రూమ్ లో మొబైల్ ఫోన్స్ వాడకంపై విద్యాశాఖ ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. రాజస్థాన్‌ బికనేర్ జిల్లా ప్రభుత్వ ఉన్నత విద్యాధికారులు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు హెచ్చరికలు జారీ చేశారు. తరగతి గదిలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరించారు.

క్లాస్ రూంలోకి వెళ్లే కంటే ముందు ఆఫీస్‌లో తమ ఫోన్లను సమర్పించి వెళ్లాలని ఉపాధ్యాయులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. తరగతి గదిలో కూడా ఉపాధ్యాయులు ఫోన్లలో మాట్లాడుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాధికారులు పేర్కొన్నారు.

Related posts