• Home
  • Trending Today
  • ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత… సర్వేపల్లి స్మరణ
Trending Today రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత… సర్వేపల్లి స్మరణ

Teachers-Day

ఏ ప్రపంచంలో జనన మరణాలు చాలా సహజం, సాధారణం కూడా. ఎందుకంటే రోజూ ఎంతోమంది పుడుతుంటారు… చనిపోతుంటారు… కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో మహాత్ములుగా మిగిలిపోతారు. వారు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాము. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు… ఈరోజే టీచర్స్ డే… ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా “టీచర్స్ డే”ను జరుపుకుంటారు. సమాజంలో గురువుకు అత్యన్నత స్థానం ఉంది. “గు” అంటే చీకటి, “రు” అంటే పోగొట్టేది. అంటే మనలో అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానం అనే దీపాన్ని వెలిగించే వారే గురువు. అందుకే భారతదేశ సంస్కృతిలో గురువును దైవంకన్నా ఎక్కువగా ఆరాధిస్తారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే మనం “టీచర్స్ డే”గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి…

ravindranath-ragur-and-sarvepalli

1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కిలోమీటర్ల దూరంలో తిరుపతికి సమీపంలో ఉన్న తిరుత్తణి అనే గ్రామంలో జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. వీరస్వామి అప్పట్లో జమిందారీ వద్ద తహసీల్దార్ గా పని చేసేవారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి రాధాకృష్ణన్ బాల్యం, ప్రాథమిక విద్య తిరుత్తణిలోనే గడిచిపోయాయి. తిరుపతి, నెల్లూరులో తరువాత విద్యనభ్యసించిన రాధాకృష్ణన్ మద్రాసు క్రిష్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు. తన 16వ ఏట అంటే 1906లో శివకామేశ్వరిని వివాహం చేసుకున్నారు రాధాకృష్ణన్. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన భార్య 1956లో 51 సంవత్సరాల వయసులో చనిపోయింది. బాల్యం నుంచి రాధాకృష్ణన్ చూపించే ప్రతిభాపాటవాలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారట.

sarvepalli-radhakrishnan1

తన 21 ఏళ్ల వయసులో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు సర్వేపల్లి. తత్వశాస్త్రంలో ఆయన అసమాన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం రాధాకృష్ణన్ ను ప్రొఫెసర్ గా ఆహ్వానించింది. సర్వేపల్లిలో ఉన్న ప్రతిభను గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ టాగూర్… కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చెప్పవలసిందిగా సర్వేపల్లిని కోరడంతో ఆయన అక్కడికి వెళ్లారు. కలకత్తాలోనే సర్వేపల్లి రాధాకృష్ణన్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆ తరువాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపడంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి అక్కడికి వెళ్లారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉపన్యాసాలిచ్చి మాతృదేశం కీర్తిని పెంచారు రాధాకృష్ణన్. ఆయన ఇచ్చే ఉపన్యాసాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునేవి.

sarvepalli-radhakrishnan

1931లో డా.సి.ఆర్. రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పనిచేశారు. ఆ సమయంలోనే “లీగ్ అఫ్ నేషన్స్ ఇంటలెక్చుయల్ కో-ఆపరేషన్ కమిటీ” సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్య మతాల గౌరవాధ్యపకులుగా పనిచేశారు. 1947 ఆగష్టు 14, 15 తేదీల్లో మధ్యరాత్రి “స్వాతంత్ర్యోదయం” సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి చేసిన ప్రసంగం భారతీయులను ఎంతగానో ఉత్తేజపరిచింది. 1949లో భారతదేశంలో ఉన్నత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. భారతదేశానికి ఆయనే తొలి ఉపరాష్ట్రపతి.

1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తరువాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1969లో భారత ప్రభుత్వం “భారతరత్న”తో సర్వేపల్లిని సత్కరించింది. ప్రపంచంలోనే అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తరువాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు.

sarvepalli-radhakrishnan2

అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యప్రాశ్చాత్య తత్వశాస్త్రాలపై ఆయన చేసే ఉపన్యాసాలు, ఛలోక్తులు, హాస్యం అందరినీ కట్టిపడేసేవి. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు సర్వేపల్లి. ముఖ్యమైన ఉపనిషత్తులు, భారతీయ తత్వశాస్త్రం, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్ – రిప్లెక్షన్, రికవరీ అఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, కాన్సెప్ట్ అఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలను కూడా రచించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం అందరికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం. నవ్యమీడియా తరపున అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు…

– విమలత

Related posts

“దేవదాస్” ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా ?

vimala t

‘అమర్ అక్బర్ ఆంటోని’… ఇల్లీబేబి ఇంట్రడక్షన్‌తో ట్రైలర్

jithu j

ఫామ్‌ హౌజ్‌లో తాగడం ఒక్కటే ఆయనకు తెలుసు

jithu j

Leave a Comment