• Home
  • వార్తలు
  • ఇక్కడ చదువు చెప్పాలంటే..ఉపాధ్యాయులు చెట్టెక్కాలి!
రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

ఇక్కడ చదువు చెప్పాలంటే..ఉపాధ్యాయులు చెట్టెక్కాలి!

Teachers, Biometric Attendence, Jarkhand

జార్ఖండ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఉపాధ్యాయులు హాజరు నమోదు కోసం నానా తంటాలు పడవలసి వస్తుంది. పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చిన్నారులకు చదువు చెప్పేందుకు బదులు చెట్లు, గుట్టలు మేడలు, ఎక్కుతూ నానా హంగామా చేస్తున్నారు. పైగా ఇది వారికి  నిత్యం ఓ సమస్యగా మారింది. దీనికి కారణం ‘బయోమెట్రిక్’ హాజరు విధానం.

అయితే చాలా ప్రాంతాల్లో నెటవర్క్ సమస్య తలెత్తుతోంది. అలా అని హాజరు నమోదు చేయక పోతే, సదరు ఉపాధ్యాయుల జీతంలో కోత విధిస్తారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులంతా స్కూలుకు చేరుకున్నంతనే సమీపంలోని చెట్లు, స్కూలు పైకప్పు, లేదా టవర్ మొదలైనవాటిని ఎక్కి అక్కడ సిగ్నిల్ లభిస్తే తమ బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తరగతులు సరిగా నిర్వహించేలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Related posts

అనుభవాలు – జ్ఞాపకాలు : శ్రీమతి వసుంధర

admin

మూగ మనసు!

chandra sekkhar

వెన్నెలాకాశం…

chandra sekkhar

Leave a Comment