telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

ఇంటర్ విదార్ది.. అసలు మార్కులు 99 .. వేసింది సున్నా .. పంతులమ్మకి జరిమానా..

telangana intermediate board

ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల మంటలు చల్లారలేదు. ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ శ్రీనారాయణ జూనియర్ కాలేజి నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా, ఇంటర్ బోర్డు ఆ అధ్యాపకురాలికి రూ.5000 జరిమానా విధించింది. ఆ జరిమానాను సదరు లెక్చరర్ వెంటనే చెల్లించినట్టు సమాచారం.

పరీక్ష పేపర్ల మూల్యాంకనం స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పైనా సస్పెన్షన్ వేటు పడింది. నవ్యకు తెలుగు సబ్జెక్టులో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు రావడం ఇంటర్ ఫలితాల అవకతవకలకు పరాకాష్ఠగా చెప్పాలి.

Related posts