telugu navyamedia
క్రైమ్ వార్తలు

బాలికను గర్భవతిని చేసిన ఓ మాస్టర్..

ఆడపిల్లలకు ఎక్క‌డా రక్షణ లేకుండా పోతుంది. గుడిలో.. బడిలో..బ‌స్సుల్లో..బ‌జార్లో ..చిన్న పెద్ద తేడా లేకుండా కామంతో క‌ల్లు మూసుకోపోయి మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. భవిష్యత్తు బాటను తీర్చిదిద్దే గురువు స్థానంలో ఉన్న వ్యక్తి పశువులా ప్రవర్తించాడు. తన దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చిన బాలికపై కన్నేసిన ట్యూష‌న్ మాస్టారు బాలికను గర్భవతిని చేశాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే…
విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్ కి వెళ్తోంది. ఆ ట్యూషన్ మాస్టర్.. బాలికపై కన్నేశాడు. సమయం చూసి.. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. నీకు తెలివి లేదు.. మేథాశక్తి పెంచుతాను.. నీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ బాలికను లోబరుచుకున్నాడు. కొన్ని రోజులుగా బాలిక సరిగా తినకపోవడం, నీరసంగా ఉండటంతో ఆమెను తల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు.

కాగా.. వైద్యులు పరిశీలించి బాలిక గర్భవతి అని, ఎనిమిదో నెల నిండింద‌ని చెప్ప‌డంతో ..కంగుతిన్నత‌ల్లిదండ్ర‌లు వెంట‌నే దిశ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. నిందితుడికి అప్పటికే పెళ్లైంది. భార్య కూడా ఉంది.

కాగా.. ఇది వ‌ర‌కే అక్క కూతురుతో వివాహం జ‌రిగింద‌ని , ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Related posts