• Home
  • వార్తలు
  • మార్కులు వేస్తానని … బాలికను తల్లిని చేసిన మాస్టారు
క్రైమ్ వార్తలు వార్తలు హాస్యం

మార్కులు వేస్తానని … బాలికను తల్లిని చేసిన మాస్టారు

Teacher Arrested for Abusing Girl Student in Prakasam

ఏలూరు నగరంలో ఒక మైనర్ బాలికను మాయమాటలతో లోబరుచుకుని ఆమెను గర్భవతిని చేసిన కీచక టీచర్ ఉదంతం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. రోడ్డు పై నగ్నం గా నడిపిస్తూ చితకొట్టి ఏలూరు టూటౌన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం బాలిక తల్లీతండ్రీ ఏలూరు టూటౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. బాలిక టూటౌన్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో చదివే సమయంలో అక్కడ ఇంగ్లీష్ టీచర్ గా కె.రాంబాబు పనిచేశాడు. అప్పట్లో మార్కులు బాగా వేయిస్తానని నమ్మబలికి బాలికను లోబరుచుకున్నాడు.

గత కొంతకాలంగా బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమెను శరీరంగా వాడుకున్నాడనీ అంటున్నారు. అయితే ప్రస్తుతం బాలిక పాలిటెక్నీక్ చదువుతోంది. బాలిక ఐదు నెలల గర్భిణీ కావడంతో విషయం తెలుసుకున్న తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. రాంబాబు స్వస్థలం కర్నూలు జిల్లా కాగా అతనికి పదేళ్ల క్రితమే వివాహం అయ్యింది. భార్య రాంబాబుని వదిలేయటంతో ఏలూరులోనే 7సంవత్సరాలుగా ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. బాలికను మోసం చేసి లోబరుచుకుని గర్భవతిని చేశాడని బాలిక బంధువులు చెబుతున్నారు. స్థానికులు రాంబాబును బట్టలు ఊడదీసి తీవ్రస్థాయిలో కొట్టటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

Related posts

చీరకట్టులో ప్రియా వారియర్

admin

సిద్ధిపేటలో ఓట్లు వచ్చాయంటే పండుగ వాతావరణం: హరీష్‌రావు

madhu

రాజమౌళి..మామగా…

chandra sekkhar

Leave a Comment