telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

టీనేజర్ల బాత్రూములో సీక్రెట్ కెమెరా పెట్టిన టీచర్… ఎలా బయటపడిందంటే ?

women online begging arrested

విలియం డెరెక్ విలియమ్సన్ (39) అనే ఉపాధ్యాయుడి స్థానికంగా ఉండే కామెరాన్ హైస్కూల్‌లో కొన్ని రోజులు పార్ట్‌టైంగా మల్టిమీడియా క్లాసులు తీసుకున్నాడు. ఈ క్రమంలో స్కూల్‌లోని విద్యార్థులతో పరిచయం పెంచుకున్న విలియమ్సన్ తరచూ విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లేవాడు. అయితే 2018, సెప్టెంబర్‌లో 15 ఏళ్ల బాలుడు ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విలియమ్సన్ బాత్‌రూంలో మొబైల్ చార్జర్ రూపంలో ఉన్న కెమెరాను బాలుడు గుర్తించాడు. వెంటనే దానిని తీసి చూడగా అందులో మెమొరీ కార్డ్ దొరికింది. ఆ మైక్రో ఏస్‌డీ కార్డును తన మొబైల్ ఫోన్‌లో పెట్టి చూసిన బాలుడికి అందులో గత కొంతకాలంగా రికార్డైన వీడియో కనిపించింది. అనంతరం ఆ మెమొరీ కార్డును బాలుడు తల్లిదండ్రుల సహయంతో పోలీసులకు అందించాడు. దాంతో పోలీసులు విలియమ్సన్ ఇంట్లో సోదాలు చేసి ల్యాప్‌ట్యాప్, మరో ఏస్‌డీకార్డును స్వాధీనం చేసుకున్నారు. ఆ మెమొరీ కార్డులో అధికారులకు 14 నుంచి 16 ఏళ్ల వయసు గల ఇద్దరు టీనేజర్ల పొర్నోగ్రఫీ వీడియోలు కనిపించాయి. అందులోని డేటా ప్రకారం అతడు 2013 నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విలియమ్సన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మిస్సోరి కోర్టులో అతడ్ని హాజరుపరిచారు. ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్న ఈ కేసులో విలియమ్సన్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు.

Related posts