telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలి: యనమల

Yanamala tdp

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జరిగిన దాడులపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా పడినందున ఈ సారి కేంద్ర బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలనే జగన్‌ ధోరణి మంచిది కాదని చెప్పారు.

ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోందని తెలిపారు. కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని అన్నారు. కరోనా వైరస్‌ విజృంభణపై సీఎం జగన్ మాట్లాడుతున్న తీరు సరికాదని యనమల అన్నారు. రాజ్యాంగ పరమైన వ్యవస్థను అవమానించేలా ఆయన మాట్లాడారని చెప్పారు. జగన్‌ స్పందనకు అనుకూలంగానే ఎన్నికల సంఘానికి సీఎస్‌ లేఖ రాశారని చెప్పారు.

Related posts