telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇది విధ్వంసక ప్రభుత్వం.. నోటీసుల పై యనమల ఆగ్రహం

Minister Yanamala comments Ys Jagan

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి అధికారులు అక్రమ కట్టడమంటూ నోటీసులు అంటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజావేదికను కూలగొట్టారని యనమల ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఉంటున్న నివాసానికే ఏకంగా నోటీసులు అంటించారన్నారు. ఇది విధ్వంసక ప్రభుత్వంగా మారిందని దుయ్యబట్టారు.

చంద్రబాబు ఉంటున్న భవనం నిర్మించినప్పడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. అక్రమంగా కట్టారని భావిస్తే ఆ రోజు వైఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కట్టడాలకు అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. తండ్రి అనుమతిచ్చిన నిర్మాణాలకు కొడుకు నోటీసులు పంపడమేంటని యనమల విరుచుకుపడ్డారు. అవన్నీ అక్రమ నిర్మాణాలైతే జగనే బాధ్యత వహించాల్సి ఉంటుదన్నారు. ఈ భవనం నిర్మించే సమయానికి సీఆర్‌డీఏ లేదన్నారు. అప్పటికి అమరావతి రాజధాని ప్రతిపాదన లేదని యనమల స్పష్టం చేశారు.

Related posts