telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం: సోమిరెడ్డి

somireddy chandramohan

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో వలస కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని అన్నారు. వారి బాధలు చూస్తుంటే మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వారిని చాలా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు.

లాక్ డౌన్ ప్రకటనకు ముందే వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాల్సింది కానీ,అలా చేయలేకపోయారు కనుక ఆ ప్రకటన వెలువడ్డ వారం రోజుల తర్వాత అయినా ఆ పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు. పీఎం కేర్స్, ముఖ్యమంత్రుల సహాయనిధులకు వేల కోట్ల రూపాయల నిధులు వస్తే ఏం చేశారు? అని ప్రశ్నించారు. వలస కార్మికులు బతికుండగానే వారికి నరకం ఏంటో చూపించామని ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.

వలస కార్మికులు కొంత మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని, తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వందల కిలో మీటర్లు నడుస్తున్నారని.. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అని ప్రశించారు. రెండు నెలల పాటు వలస కార్మికులు ఇబ్బంది పడిన తర్వాత వారి కోసం కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిందని విమర్శలు చేశారు.

Related posts