telugu navyamedia
andhra political

బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్ వైసీపీలు: రావుల

TDP,Ravula,YCP,TRS
బీజేపీ కనుసన్నల్లో టీఆర్ఎస్ వైసీపీలు నడుస్తున్నాయని టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో టీటీడీపీ జిల్లాల అధ్యక్షుల సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కేంద్రం పెత్తనంపై మాట్లాడిన కేసీఆర్.. మమతా బెనర్జీ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సమాయత్తంపై చర్చించినట్లు రావుల తెలిపారు. 
రెండు విడతలుగా జిల్లాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీటీడీపీ మద్దతుతో గణనీయ సంఖ్యలో సర్పంచులు గెలిచారని రావుల చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. కేంద్రానికి రైతులపై ప్రేమ ఉంటే.. పంటకు మద్దతు ధర ప్రకటించాలని రావుల డిమాండ్ చేశారు.

Related posts

కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి: హరీశ్ రావు

vimala p

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం…16 మంది దుర్మరణం

vimala p

తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు: కేసీఆర్‌

vimala p