telugu navyamedia
andhra news political trending

రాజ్య సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు… అడ్డుకుంటాం.. : టీడీపీ

tdp on triple talak bill issue

ట్రిపుల్ తలాక్ పై దేశంలో గందరగోళం నెలకొంది. దీనిని కూడా నాయకులు రాజకీయాలకు వాడుకుంటుండటంతో ఒక సామజిక వర్గం నలిగిపోతుంది. దీనిపై ప్రతి రాజకీయ పార్టీ వారి సొంత రంగు పులిమి, ఇష్టానికి బిల్లుపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ బిల్లుపై టీడీపీ మరోమారు తన అభిప్రాయాన్ని తెలిపింది. అందులో, ఎట్టి పరిస్థితుల్లో ముమ్మారు తలాక్‌ బిల్లును రాజ్యసభలో పాస్‌ కానివ్వబోమని తెదేపా ఎంపీలు స్పష్టంచేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణించేందుకు ఉద్దేశించిన నూతన బిల్లు సోమవారం రాజ్యసభ పరిశీలనకు రానుంది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ఈ నేపథ్యంలో తెదేపా ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ, ఇప్పటికే తమ పార్టీ సభ్యులందరికీ సభకు రావాలని విప్‌ జారీ చేశామన్నారు. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబడతామని చెప్పారు. తలాక్‌ బిల్లును చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకుని తీరుతామని చెప్పారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని తెదేపా డిమాండ్‌ చేస్తోందని మరో ఎంపీ నారాయణ చెప్పారు. స్త్రీలకు న్యాయం చేయడం కోసం పురుషులకు అన్యాయం చేయొద్దని, స్త్రీ, పురుషులకు సమాన న్యాయం జరిగేలా బిల్లు ఉండాలని ఆయన కోరారు.

తలాక్ బిల్లు రాజ్యసభకు వస్తున్న నేపథ్యంలో ఆ బిల్లును అనుమతించేది లేదని కాంగ్రెస్‌ సహా 10 విపక్షాలు తేల్చి చెప్పేశాయి. తలాక్‌తో ముస్లిం మహిళలు ఎంతగానో నష్టపోతున్నారని వివరించారు. సోమవారం తప్పనిసరిగా హాజరుకావాలని భాజపా, కాంగ్రెస్‌ తమతమ సభ్యులకు విప్‌లు జారీ చేశాయి. బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభలో ప్రవేశపెడతారు.

Related posts

బండ్ల గణేష్ కనబడుట లేదు… నెటిజన్ల ట్రోలింగ్

vimala p

సినిమాలు నన్ను దేవుడికి.. దూరం చేస్తున్నాయి.. : దంగల్ భామ జైరా వాసిమ్

vimala p

విమానంలో నర్స్… ఆమె చేతుల్లో ప్రాణాలు వదిలిన పసిబిడ్డ

vimala p