telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయం!

ntr-biopic-should-be-make-by-ycp_b_0702170714

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ఎన్టీఆర్ యుగం ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ తెలుగు ప్రజల మన్ననలు పొందారు.

1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన తెలుగు దేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. పార్టీ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. తెలుగువాళ్ల సత్తా జాతీయస్థాయిలో చాటిన తొలి వ్యక్తి ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు 2 కిలో బియ్యం, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం స్థాపించారు. ఢిల్లీ కోటల్ని కదిలించిరాజకీయాల్లో నూతన అధ్యాయానికి నాంది పలికిన నటసార్వభౌమ ఎన్టీరామారావు. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానించి ఎన్నో మార్పులకు నాంది పలికారు. Ntr movie photos

రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలో ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్. సుమారు 400 చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.

Related posts