telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిరుద్యోగులే మీ ప్రభుత్వానికి చావుడప్పు కొడతారు: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొంటూ, ఇదే విధంగా పరిపాలిస్తే మాత్రం నిరుద్యోగ యువతే మీ ప్రభుత్వానికి చావు డప్పు కొడుతుందని లోకేశ్ హెచ్చరించారు. ప్రసంగానికి చప్పట్లు కొట్టలేదని నిరుద్యోగుల కంటే కుక్కలు మేలు అని ఓ మంత్రి అన్నారంటూ నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం అని మండిపడ్డారు.

వైసీపీ కార్యకర్తలకు గ్రామ వలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి రూ.4000 కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? అని నిలదీశారు. గ్రామ సచివాలయ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి ఒక్కో పేపర్ రూ.5 లక్షలకు అమ్ముకుని 19 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నందుకు కొట్టాలా? అంటూ నిలదీశారు.

Related posts