telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే: నక్కా ఆనంద్ బాబు

nakka anand on tdp party with nri's

మూడు రాజధానుల బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఇదే సమయంలో విపక్ష నేతలు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు స్పందిస్తూ ఈ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం చాలా విచారకరమని అన్నారు.

అమరావతి కోసం అన్ని వర్గాల ప్రజలు దాదాపు 230 రోజుల నుంచి వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాజధాని విభజన, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం దురదృష్టకరమని అన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజని ఆనంద్ బాబు చెప్పారు. వారం, పది రోజులుగా ఊహించిందే జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలను రేకెత్తించిందని అన్నారు. పెద్దలందరూ కలిసి అనుమానాలను ఈరోజు నిజం చేశారని చెప్పారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ విషయంలో కోర్టు ఎలా చీవాట్లు పెట్టిందో చూశామని చెప్పారు. రాజధానుల అంశంలో కూడా సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ, వాటన్నింటినీ పట్టించుకోకుండా గవర్నర్ ఆమోదం తెలిపారని అన్నారు.

Related posts