telugu navyamedia
andhra crime news political

నాదెండ్ల బ్రహ్మంకు బెయిల్ మంజూరు..!

TDP-flag

తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాలుగు రోజుల క్రితం గుడివాడ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.

దీంతో బెయిల్ కోసం హైకోర్టును బ్రహ్మం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పోలీసులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నాదెండ్ల బ్రహ్మంను అరెస్ట్ చేయకుండా విచారించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

Related posts

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు కన్నుమూత

vimala p

లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఇళ్లవద్దకే అత్యవసర పాస్‌లు!

vimala p

ఇండియా అబ్బాయి, పాకిస్థాన్ అమ్మాయి ..పెళ్లికి ఆటంకం!

ashok