telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హోదా పేరు ఎత్తాలంటే… జగన్ వణికిపోతున్నాడు

cm Jagan tirumala

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని పక్కన పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా టీడీపీ కూడా ప్రచారం కొనసాగిస్తోంది.  ఈ నేపథ్యంలో వైసీపీపై  ఎంపీ రామ్మోహన్ నాయుడు పై ఫైర్ అయ్యారు.  ఎంతో అనుభవం ఉన్న పనబాక లక్ష్మిగారిని తిరుపతి ప్రజలు గెలిపించాలని..నారా లోకేష్, చంద్రబాబు పర్యటనతో టిడిపికి జోష్ వచ్చిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజలు టిడిపిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని… ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేశామని గుర్తు చేశారు. మోదితో పెట్టుకోవద్దని చాలామంది చెప్పినా మేము ఏపీ కోసం పోరాటం చేశామని తెలిపారు. జగన్ 25 ఎంపిలు గెలిస్తే…కేంద్ర మెడలు వంచి హోదా తెస్తాము అన్నాడని గుర్తు చేశారు. 22 ఎంపిలను మందిని గెలిస్తే…22 నెలలు ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి హోదా పేరు ఎత్తారా అని నిలదీశారు. హోదా పేరు ఎత్తాలంటే జగన్ వణికిపోతున్నాడని.. కేసులకు భయపడి జగన్ నోరు ఎత్తడం లేదని తెలిపారు. 28 ఎంపిలతో జగన్ హోదా కోసం కాకుండా.. కేసులు కోసం వాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వైపీని గెలిపిస్తే… శ్రీవారి ఏడు కొండలను అమ్మేస్తారని మండిపడ్డారు. పార్లమెంటు పరిధిలో ఏడు నియోజక వర్గాలోని భూములు అమ్మేస్తారని… ప్రజలు వాస్తవాలు గ్రహించి టిడిపి గెలిపించాలని కోరారు.

Related posts