telugu navyamedia
andhra news political

రాజకీయ కారణాలతోనే సిట్ వేశారు: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వాస్తవాలను వెలికి తీసేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు గల్లా జయదేవ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో తాము భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడంలో వాస్తవం లేదని తెలిపారు. కేవలం రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని చెప్పారు.

Related posts

బీజేపీనే స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని అందిస్తుంది: మోదీ

vimala p

జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్‌రెడ్డి

vimala p

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్

vimala p