telugu navyamedia
andhra news political

తనపై లాఠీ ఛార్జ్ చేస్తే.. మహిళలు కాపాడారు: గల్లా జయదేవ్

MP Galla Jaayadev challenge Modugula

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి కోర్టు బేల్ మంజూరు చేయడంతో మంగళవారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 149 సెక్షన్ నోటీసు తనకు ఇవ్వ లేదని, తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే… పోలీసులు అడ్డుకుని వైలెంట్‌గా ప్రవర్తించారన్నారు. తనపై లాఠీ ఛార్జ్ చేస్తే..తుళ్లూరు మహిళలు కాపాడారని చెప్పారు. తనను పోలీసులు గోళ్ళతో గిచ్చారని, చొక్కా చింపారని జయదేవ్ తెలిపారు.

సుమారు 15 గంటల పాటు తనను నరసరావుపేట, రొంపిచర్ల, కొల్లిపారతో పాటు గుంటూరు మొత్తం తిప్పి.. పోలీసుస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని చెప్పారు. వైద్య సదుపాయం కావాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు జీపులోనే వైద్య పరీక్షలు చేసి…జైలుకి పంపారని మండిపడ్డారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

Related posts

మంతెన సత్యనారాయణ ఆశ్రమానికీ .. ఏపీ ప్రభుత్వ నోటీసులు..

vimala p

రాజకీయ చదరంగంలోకి.. షిర్డీ ..ఆస్తుల కోసమేనా.. మింగేశారా ..!

vimala p

చంద్ర బాబు ను రాజకీయంగా కేసీఆర్ దెబ్బతీయగలడా ?

ashok