telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు.. మండలిలో లోకేష్‌ ఫైర్

ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌ సోమవారం శాసనమండలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫమైందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లోకేష్‌ పేర్కొన్నారు. విత్తనాల కోసం రైతులు రోడ్డేక్కి ధర్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే ఈ క్రమంలో ఏపీ రాష్ట్రానికి అందాల్సిన విత్తనాలు తెలంగాణకు పంపారని ఆయన ఆరోపించారు.

ఏ రాష్ట్రంలో చేయని విధంగా టీడీపీ హయాంలో రైతుల రుణాలు మాఫీ చేశామని అన్నారు. ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాలకు రూ.934కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. అసెంబ్లీలో చాలెంజ్‌ చేసిన సీఎం జగన్‌.. సున్నా వడ్డీ రుణాలకు బడ్జెట్‌లో రూ.100కోట్లే కేటాయించారని లోకేష్ ఎద్దేవా చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వడ్డీ లేని రుణాలపై తీసుకొన్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం కూడ కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Related posts