telugu navyamedia
రాజకీయ

జైలుకు ఉమ‌..14 రోజులు రిమాండ్‌..!

మాజీ మంత్రి, తేదేపా నేత‌ దేవినేని ఉమ 14 రోజులు రిమాండ్ విధించారు. హ‌నుమాన్‌జంక్ష‌న్, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలుకు బుధ‌వారం రాత్రి త‌ర‌లించారు.ఉమ‌తో పాటు 18 మందిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఉమ‌ను ఏ1గా చూపించారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండంలో గ‌డ్డుమ‌ణుగులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో కులం పేరుతో దూషిస్తూ, కర్ర‌లు, రాడ్ల‌తో దాడికి దిగార‌ని వైకాపా నేత‌లు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు.

జి.కొండూరు మండంలో కొండ‌ప‌ల్లి అట‌వీప్రాంతంలో ఏపీ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇళ్ల‌స్థ‌లాలు కేటాయిస్తున్న స‌మ‌యంలో అక్క‌డ మెర‌క‌భూమి ని చ‌దును చేస్తున్న ప‌రిణామంలో అక్క‌డ‌కు చేరుకున్న దేవినేని ఉమ అట‌వీ భూమిలో మైనింగ్ చేస్తూన్నారంటూ ఆరోప‌ణులు చేశారు. దీంతో వైకాపా నేత‌ల‌కు తేదాపానేత‌ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

కాగా.. వైకాపా నేత‌లు త‌మ‌పై దాడికి దిగారంటూ కృష్ణాజిల్లా జి.కొండూరు మండంలో పోలీస్‌స్టేష‌న్‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఈక్ర‌మంలో ్ఇరువ‌ర్గాలు స్టేష‌న్‌కి చేరుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. ఈ స‌మ‌యంలోనే దేవినేని ఉమ‌కు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.

Related posts