telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్టు ఎందుకు : చంద్రబాబు

chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ అవినీతిపరుడు కాబట్టి అంతా అవినీతిపరులనుకుంటే సరిపోతుందా.. కేసులకు భయపడి పోలవరంపై కేంద్రాన్ని అడగకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారు. పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారా..? లేదా..? నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్టు ఎందుకు అని ప్రశ్నించారు. పోలవరంపై అవినీతి అని మాపై ఆరోపణలు చేసి మళ్లీ అదే కాంట్రాక్టు కు పనులేలా ఇస్తారు అని అడిగారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చారు నాడు మేం వేసిన అంచనాలను తప్పు పట్టారు.. ఇప్పుడు అవే అంచనాలు చెబుతున్నారు. తనలాగే అందరూ అవినీతిపరులు అనే రీతిలో అందరికీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పరిహరం పొందిన పోలవరం నిర్వాసితులకు కూడా ఎకరా రూ. 10 లక్షల మేర పరిహారం అందజేస్తామన్నారు.. దాని సంగతేంటి..? కేంద్రంతో పోలవరం నిర్మాణంపై ప్రకటన ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.  పోలవరం ప్రాజెక్టుకు వెళ్తుంటే నేతలను అరెస్ట్ చేయడం కరెక్టా..? ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది అన్నారు. గోదావరి నీళ్లు తెలంగాణ భూభాగం మీదుగా శ్రీశైలం తెస్తామని సీఎం జగన్ చెబితే.. అది కుదరని పని అని చెప్పాను. నేను చెప్పినట్టుగానే ఏడాదిన్నర తర్వాత వెనక్కు తగ్గిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రశ్నలు అడిగితే మమల్ని సస్పెండ్ చేస్తారా..? స్పీకర్ తమ్మినేని అనుచితంగా వ్యవహరిస్తున్నారు అని బాబు చెప్పారు. పోలవరంలో వైఎస్ విగ్రహంపై పెడుతున్న శ్రద్ధ.. ప్రాజెక్టుపై పెట్టడం లేదు అని పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు. కేంద్ర నిధులతో పోలవరం నిర్మాణం చేస్తే.. వైఎస్సార్ విగ్రహం పెడతారా..? కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా..? కేంద్రం ఇచ్చే డబ్బులపై పెత్తనం చేస్తూ వైఎస్సార్ విగ్రహం పెడతారా..? కేంద్రం నిధులివ్వకుంటే.. వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన కూడా ఓ కారణం అవుతుంది అని చంద్రబాబు హెచ్చరించారు.

Related posts