telugu navyamedia
andhra news political

అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉంది: ఎంపీ కనకమేడల

MP kanaka Medala comments elections

అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ గుర్తు చేశారు.అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలపై సీఎం జగన్ కు అవగాహన లేదన్నారు. చేతకానితనంవల్లే అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అవసరమవుతాయని ఆ పార్టీ నాయకులు జపం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పథకంగా అమరావతిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలనే వైసీపీ ప్రభుత్వం కొత్త రాజధాని వెంట పడుతోందన్నారు. అప్పట్లో చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జగన్‌ విపక్ష నాయకుడిగా అప్పుడు రాజధాని అమరావతిని అంగీకరించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు.

Related posts

తొలి జీవో జారీ చేసిన జగన్ సర్కార్!

ashok

బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నా

vimala p

రష్యా : .. అరుదైన వజ్రం .. వెలికితీత..

vimala p