telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు చేపట్టిన “చలో ఆత్మకూరు” విజయవంతం: కళా వెంకట్రావు

kalavenkat rao tdp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతమైందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితిని రాష్ట్రం దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పిలుపుతో దేశమంతా ఏపీ గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నారని తెలిపారు. వైసీపీ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ నేతలు విమర్శించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టులా అంటూ నిలదీశారు. వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అయిందన్నారు. పోలీసు వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. బాధితులు కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోకుండా దాడి చేసిన వారి పెట్టిన కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు.

Related posts