telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్‌రెడ్డి

jc-diwakar-reddy

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని సూచించారు. జగన్ ఏడాది పాలనకు వందకు 110మార్కులు వేస్తాననిఎద్దేవాచేశారు.

రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు. జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని దివాకర్‌రెడ్డి చెప్పారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని పేర్కొన్నారు. టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ.సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు.

Related posts