telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రజల వద్దకే పాలనా.. నేటి నుండే ‘జన్మభూమి’ కార్యక్రమం… పాల్గొన్న బాబు…

tdp janmabhumi program in all districts of ap

ఏపీసీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నేటి నుండి జన్మభూమి కార్యక్రమాన్ని సంకల్పించారు. పదిరోజులు జరగనున్న ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాలలో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం దిశగా టీడీపీ ముందుకు పోనుంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ జన్మభూమి ద్వారా టీడీపీ సంకల్పించింది. ఇందులో ప్రజలు, ముఖ్యంగా పిల్లలను భాగస్వామ్యులను చేయనుంది. అందుకే వారి సంక్రాంతి సెలవుదినాలలో మార్పులు చేసింది.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవనుంది. అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చొరవ చూపడం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం, పలు పథకాల లబ్ధిదారులకు ప్రయోజనం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈనెల 11వ తేదీ వరకు మొత్తం పది రోజులపాటు జరిగే కార్యక్రమంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఒక్కోరోజు ఒక్కోదానిపై సభల్లో చర్చించాలని కూడా నిర్ణయించారు.

తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే సభలో పాల్గొని కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. తొలిరోజు రాష్ట్ర పునర్విభజన అంశంపై చర్చిస్తారు. లబ్ధిదారులకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, నిరుద్యోగభృతి పంపిణీ చేస్తారు. ఇళ్ల స్థలాల కమబద్ధీకరణ పట్టాలు అందిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో ఈ పది రోజల్లో కనీసం ఒక్క సభలోనైనా తాను పాల్గొనాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీంతో అధికారులు సభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తు హడావుడిగా ఉన్నారు.

Related posts