• Home
  • వార్తలు
  • తెలంగాణలో టీడీపీకి ఆదరణ తగ్గలేదు..చంద్రబాబుకు వివరించిన నేతలు
రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణలో టీడీపీకి ఆదరణ తగ్గలేదు..చంద్రబాబుకు వివరించిన నేతలు

Chandrababu, AP Income, special status

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో  టీడీపీ దూకుడు పెంచింది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చంద్రబాబుకు నేతలు వివరించారు. 20 సీట్లో 35శాతం ఓటింగ్ పదిలంగా ఉందన్నారు. మరో 20 సీట్లలో 32శాతం ఓటింగ్ ఉందని తెలంగాణ టీడీపీ నేతలు తెలిపారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ సంపద అని, టీడీపీకి ఆటుపోట్లు కొత్తకాదన్నారు. 36ఏళ్ల చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని తెలిపారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు టీడీపీకి తరగని ఆస్తిని అని చెప్పుకొచ్చారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా చంద్రబాబుతో భేటీ అయ్యామని చెప్పారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో సర్వసభ్య సమావేశం ఉందని తెలిపారు.

Related posts

రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి పై దాడి… రక్షకుడినే భక్షిస్తున్న వైనం

jithu j

బిగ్ బాస్ లో “రంగు” ట్రైలర్… తనీష్ బర్త్ డే స్పెషల్

vimala t

70కోట్ల విలువైన స్థలం కబ్జా..?

admin

Leave a Comment