telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏదైనా ఉంటే తనను అరెస్ట్ చేయాలి.. సీఐడీ అధికారులపై గంటా ఫైర్

Ganta srinivas tdp

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు సీఐడీ అధికారులపై మండిపడ్డారు. విశాఖలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. సీఐడీ అదుపులో ఉన్న తన సన్నిహితుడు నలంద కిషోర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనను కార్యాలయంలోకి సీఐడీ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆయన సీఐడీ అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు.

కిషోర్ వ్యవహారంలో సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు. కిషోర్ దేశ ద్రోహానికి పాల్పడలేదని అన్నారు. దేశ రక్షణ అంశాలను లీక్ చేయలేదని, సోషల్ మీడియాలో తనకు వచ్చిన ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేశాడని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నో మెసేజ్ లను షేర్ చేస్తుంటారని చెప్పారు. పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైన కేసు ఇది కాదని దుయ్యబట్టారు. రాజకీయపరంగా ఏదైనా ఉంటే తనను అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ తెల్లవారుజామున కిషోర్ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Related posts