telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజశేఖరన్నా… మీరందించిన స్ఫూర్తి మరువలేనిది: గల్లా అరుణ

Galla aruna kumari

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా టీడీపీ నేత గల్లా అరుణకుమారి సోషల్ మీడియాలో స్పందించారు. వైఎస్ తో ఆమె తన ఆత్మీయ అనుబంధాన్ని భావోద్వేగభరితంగా వివరించారు. రాజశేఖరన్నా… అన్నగా మీరు అందించిన స్ఫూర్తి, రాజకీయంగా మరువలేనిదని పేర్కొన్నారు.

కొన్నేళ్ల కిందట ఇదే రోజు మీరు ప్రయాణించే హెలికాప్టర్ కోసం చిత్తూరులో ఎదురుచూసిన క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదిలాడుతున్నాయి అంటూ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

“మీ మరణం తర్వాత నా రాజకీయ జీవితం అనుకోని మలుపు తిరిగినా, మీరు నాపై చూపించిన ఆప్యాయతను ఎల్లప్పుడు స్మరించుకుంటాం. అలాంటి మీరు మా మధ్య లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ రోజు మీ వర్ధంతి సందర్భంగా మీ ఆత్మకు శాంతి కలగాలని… మీ చెల్లెమ్మ గల్లా అరుణకుమారి” అంటూ తన సందేశాన్ని వెల్లడించారు.

Related posts