telugu navyamedia
andhra news political trending

ఆఖరి ధర్మపోరాటం… శ్రీకాకుళంలో వేదిక…

tdp dharmaporata diksha in srikakulam today

రాష్ట్రవిభజనలో భాగంగా చేసిన హామీలను నెరవేర్చకుండా జాప్యం చేస్తున్న కేంద్రప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాటం చేస్తుంది. ఇప్పటీకే అనేకసార్లు ధర్మపోరాట దీక్ష పేరిట పోరాటాలు చేసింది. నేడు శ్రీకాకుళం జిల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియం లో ఆఖరి ధర్మపోరాట దీక్ష సంకల్పించింది ఏపీ ప్రభుత్వం. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు తో సహా, ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర ముఖ్యనేతలు హాజరవుతున్నారు. ఇటీవల ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు కేంద్రప్రభుత్వం 350 కోట్లు మంజూరు చేసి, మళ్ళీ వెనక్కు తీసుకోవటంతో సహా పలు అంశాలపై నేడు ప్రజలతో దీక్షావేదికపై బాబు కేంద్రాన్ని నిలదీయనున్నారు.

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నేడు జరుగుతున్న ధర్మదీక్షలో బాబు ప్రజలకు వివరించనున్నారు. కేంద్రం రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ సహా పలు హామీలు కేంద్రం నెరవేర్చలేకపోయిందని, కేంద్రం వైఖరిని ఎండగట్టడానికి ఈ దీక్షలు చేపడుతున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో నేడు చంద్రబాబు పర్యటనలో భాగంగానే జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు.

Related posts

ఎంపీ కవిత చొరవతో గల్ఫ్ బాధితులకు విముక్తి

ashok

28న ‘మంచు కురిసే వేళలో’…

vimala p

ఢిల్లీ నుంచి లక్నో బయలుదేరిన చంద్రబాబు

vimala p