telugu navyamedia
andhra crime news political

తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని

Chintamaneni tdp

తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. బుధవారం పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.సోదాలు పేరుతో పోలీసులు ఇవాళ ఉదయం తన ఇల్లు ధ్వంసం చేశారని చింతమనేని మండిపడ్డారు.

నన్ను భయభ్రాంతులకు గురిచేస్తే.. జిల్లా అంతా అణిగిమణిగి ఉంటుందను కుంటున్నారని చెప్పారు. తనను రెచ్చగొట్టారని, తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్సా రుజువు చేస్తే.. తన తండ్రి ఆస్తి, తన ఆస్తి పేదలకు దానం చేస్తానని, లేకపోతే మంత్రి పదవికి బొత్సా రాజీనామా చేస్తారా? అంటూ చింతమనేని సవాల్ విసిరారు.

Related posts

అమెరికా బోటులో అగ్నిప్రమాదం.. 34 మంది ప్రయాణికుల గల్లంతు!

vimala p

రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు: వీ.హెచ్

vimala p

వలసల పుణ్యం : జై తెలుగుదేశం అని.. నాలుక కరుచుకున్న తెరాస అభ్యర్థి..

vimala p