telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

6 నెలల్లో రూ. 25 వేల కోట్ల అప్పులు.. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

chandrababu fire on AP CS again

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ ఆరు నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఏమి సాధించిందంటే… అది అప్పుల్లో రికార్డు సృష్టించడమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గత 6 నెలల్లో రూ. 25 వేల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. అంటే నెలకు దాదాపుగా మూడున్నర వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

ఒక్క ఆగస్టు నెలలోనే 5 సార్లు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. . అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపితే ఎలాగని ప్రశ్నించారు. ఓ వైపు భారీ ఎత్తున అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచావని తనపైనే వైసీపీ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలించడం చేతకాకపోతే సలహాలు తీసుకోవాలంటూ చంద్రబాబు హితవు పలికారు.

Related posts