telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చంద్రబాబు వైఖరి: రోజా ఫైర్

roja ycp mla

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత గా కాకుండా చంద్రబాబు పనికిమాలిన నాయకుడిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ఉదయం జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు ‘ఉన్మాది’ అన్న పదం వాటడంతో చర్చ పక్కదారి పట్టి, వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లింది. ఈ సమయంలో చంద్రబాబు సభకు, సీఎంకు క్షమాపణ చెప్పాల్సిందేనని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ క్రమంలో రోజా మాట్లాడుతూ, గత అసెంబ్లీలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతోందని విమర్శలు గుప్పించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ ను తాను ప్రస్తావిస్తే, ‘కామ సీఎం’ అని తాను అన్నట్టు ఎల్లో మీడియాలో వార్తలు వేయించుకుని, తనను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాను కోర్టుకు వెళ్లి, పోరాడి, సస్పెన్షన్ ఎత్తివేతపై ఆదేశాలు తెచ్చుకున్నా సభలోకి రానివ్వలేదని గుర్తు చేశారు. నాడు ప్రజా సమస్యలపై తాను మాట్లాడితే, ఏడాది పాటు సస్పెండ్ చేశారని, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని రోజా మండిపడ్డారు.

Related posts