telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జోడు పదవుల విధానానికి టీడీపీ స్వస్తి!

chandrababu

ఒక్కరికే రెండు పదవులు ఉండే విధానానికి టీడీపీ స్వస్తి పలికింది. మంగళవారం నాడు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబుకు నేతలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వారికి జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పించారు. ఏదో ఒక్క పదవితోనే ఉండేలా చూశారు. ఆ తర్వాత ఈ పద్దతిని ఎందుకో కొనసాగించలేకపోయారు. కొన్ని జిల్లాల్లో అధ్యక్ష స్థానాల్లో కన్వీనర్లను నియమించారు.పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఇంచార్జీలుగా నియమించే పద్దతి వద్దని ఒకరిద్దరూ నేతలు సూచించాచారు. అయితే చంద్రబాబు వారిపై మండిపడ్డారు.

పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించి వైఎస్ఆర్‌సీపీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించినట్టుగా టీడీపీ భావిస్తోంది.ఇదే విధానాన్ని అవలంభించాలనే అభిప్రాయంతో టీడీపీ నాయకత్వం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విధానాన్ని అమలు చేసే విషయమై పార్టీ నాయకత్వం త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. పార్లమెంట్ నియోజకవర్గానికి సమన్వయకర్తను నియమించడం ద్వారా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో సమస్యలపై కేంద్రీకరించే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Related posts