telugu navyamedia
andhra news political

చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు: లక్ష్మీపార్వతి

laxmi parvathi ycp

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. దుర్బుద్ధి వల్లే చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ కూడా చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలే చేస్తున్నారని అన్నారు.

జూమ్ ద్వారా మీటింగులు పెట్టుకుంటూ జూమ్ నాయకుడిగా ఎదిగిపోయారని అన్నారు. పాలనాకాలంలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నారఉ. ఏడాదిలోనే 90 శాతం హామీలను జగన్ పూర్తి చేశారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఒక తండ్రిలా జగన్ సేవ చేస్తున్నాడని అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ ఇద్దరూ టీడీపీ సానుభూతిపరులని లక్ష్మీపార్వతి అన్నారు.

Related posts

హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థి ఖరారు

vimala p

క్లైమాక్స్ కు కన్నడ రాజకీయం.. ఈనెల 18న విశ్వాస పరీక్ష

vimala p

ఆగని ఇసుక మరణాలు.. మరో ఇద్దరు తాపీ మేస్త్రీల ఆత్మహత్య

vimala p