telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా పరిస్థితులపై డాక్టర్లతో చంద్రబాబు చర్చ

tdp chandrababu

ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ చికిత్స, తదితర అంశాలపై ప్రముఖ డాక్టర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై అవగాహన అందరికీ అవసరమని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఇతర అంశాలపై అధ్యయనాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నానని తెలిపారు. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న యోధులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 15న కరోనా మృత యోధులకు నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. గత రెండు వారాల్లో ఏపీలో కరోనా వృద్ధి రేటు అత్యధికంగా ఉందన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ప్రస్తుతానికి మందులు లేవని పేర్కొన్నారు. డిజిటల్ సోషలైజేషన్, భౌతికదూరం రెండూ ముఖ్యమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.అంబులెన్స్ లు, ఆసుపత్రుల్లోనూ శానిటైజేషన్ ఎంతో ముఖ్యమని అన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో తగు వసతులు ఉంటే రోగులు భయపడకుండా ఉంటారని తెలిపారు.

Related posts