telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలి: చంద్రబాబు

chandrababu on amaravati mla quarters

కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఏపీలో అరాచకపాలన, దున్నపోతు పాలన నడుస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది విధ్వంసక ప్రభుత్వం తప్ప, ప్రజాప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం కాదని విమర్శించారు.

తమపై అక్రమంగా పెట్టిన కేసుల గురించి కచ్చితంగా నిలదీస్తామని చెప్పారు. అనవసరంగా రెచ్చిపోయి తమపై కేసులు బనాయించొద్దని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. తమ హయాంలో కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లాలో ఒక తట్ట మట్టి తీశారా? అని ప్రశ్నించారు. ఎప్పటికైనా సరే రాయలసీమ బాగుపడాలంటే గోదావరి నీళ్లు రావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts