telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల

gorantla buchayya on resignation

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. సేవ్ అమరావతి పేరుతో రాజమండ్రిలో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… కమ్మ సామాజిక వర్గంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అమరావతిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ. 29 వేల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నియంత ధోరణిలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వాస్తవాలు బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని అన్నారు.

Related posts