telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మేడమ్ టచ్ చేయకండి.. పోలీసులపై అఖిలప్రియ ఫైర్

bhuma akhila into ycp soon

తెలుగుదేశం నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలను వారు ఉంటున్న హోటల్ గదిలోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా గదిలోకి వచ్చిన మహిళా పోలీసులపై భూమా అఖిలప్రియ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

మేడమ్ టచ్ చేయకండి. మీరు రూమ్ లోకి వెళ్లే అథారిటీ ఉందా? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా అఖిలప్రియ తన గది నుంచి బయటకొచ్చేందుకు వీల్లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, అఖిలప్రియ లిఫ్ట్ ద్వారా కిందకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆమెను మగ పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇటు టీడీపీ మద్దతుదారులు, అటు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts