telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశానికే వన్నెతెచ్చిన .. మండలి ఛైర్మెన్ షరీఫ్ … టీడీపీ అగ్రనేతల పాలాభిషేకాలు..

tdp appreciations on council chairmen sharif

ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ లో పెట్టిన మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలనే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు..రాజధాని గ్రామాల ప్రజలు షరీఫ్ ను అభి నందిస్తున్నారు. బిల్లులపై ఆయన ఈ నిర్ణయం తీసుకోగానే మండలిలోని టీడీపీ సభ్యులు సంబరాలు చేసుకొన్నారు. ఛైర్మన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి రాజధాని ప్రాంత వాసులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇక, ఛైర్మన్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నాని చెప్పటం పైన వైసీపీ..బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. మంత్రులు కొందరు ఛైర్మన్ ను దూషించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటి పైన మాత్రం ఛైర్మన్ స్పందన ఆసక్తి కరంగా మారింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మండలి ఛైర్మన్ షరీఫ్ హాట్ టాపిక్ మారారు.

ఛైర్మన్ నిర్ణయం పైన టీడీపీ సంతోషం వ్యక్తం చేస్తుంటే..అధికార పక్షం సీరియస్ గా స్పందిస్తోంది. మండలిలో బిల్లు పైన నిర్ణయం సమయంలో కొందరు మంత్రులు ఛైర్మన్ ను అవమానించే విధం గా వ్యాఖ్యలు చేసారని..దూషించారని టీడీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. మండలి ఛైర్మన్ ను మంత్రులు అవమానించారన్న విషయం తెలిసి అచ్చెన్నాయుడు ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు. మండలిలో జరిగిన పరిణామాలతో బాధ పడవద్దంటూ అచ్చెన్న ఆయనకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో తనను దూషించినందుకు తానేమీ బాధపడటం లేదని… రాజకీయాల్లో ఇలాంటివి సహజమని చైర్మన్‌ ఆయనతో అన్నారు. ఆయనకు అచ్చెన్న పాదాభివందనం చేశారు. చాలా ఒత్తిడిని తట్టుకొని మీరు నిర్ణయం తీసుకొన్నారంటూ… లక్షలాది మంది గుండెల్లో మీరు ఉంటారని మాజీ మంత్రి అచ్చెన్న ఛైర్మన్ ను అభినందించారు.

ఈ బిల్లులపై ఛైర్మెన్ నిర్ణయం తీసుకోగానే మండలిలోని టీడీపీ సభ్యులు సంబరాలు చేసుకొన్నారు. అధికార సభ్యులు, మంత్రులు ఎన్ని ఒత్తిళ్లు, అడ్డంకులు సృష్టించినా.. అవేవీ ఖాతరు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడారంటూ టీడీపీ నేతలు ప్రశంసలతో ముంచెత్తారు. ఛైర్మన్ నిర్ణయం వెలువడగానే..రాజధాని ప్రాంతంలోషరీఫ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసారు. ఇదే సమయంలో మంత్రులు మండలి వాయిదా పడగానే ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం పైన మండి పడ్డారు. ఆయన నిర్ణయంతో చరిత్రలో ఇది బ్లాక్ డే గా మంత్రులు అభివర్ణించారు. బీజేపీ నేతలు సైతం ఛైర్మన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓటింగ్ నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డారు. విచక్షణాధికారంతో నిర్ణయాలు తీసుకోవటం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీలు చెప్పుకొచ్చారు.

Related posts