telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిన్న టీడీపీ అభ్యర్థిగా ప్రచారం.. నేడు వైసీపీ గూటికి ఆదాల?

TDP Adala prabhakar reddy YCP

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల 126 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేరును ఈ 126 మంది అభ్యర్థుల కంటే ముందే చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆదాల టీడీపీకీ గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి వెళ్తారని తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి వస్తే నెల్లూరు‌ లోక్‌సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు పార్టీ మారిన వారంతా.. టికెట్ దక్కలేదని పార్టీని వీడారు. కానీ ఆదాల విషయంలో మాత్రం ఇది పూర్తిగా విభిన్నంగా ఉంది. ఆదాలకు టీడీపీలో టికెట్ కన్ఫామ్ అయినప్పటికీ.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

టీడీపీ టికెట్‌ సాధించడంతో పాటు తనకు రావాల్సిన బిల్లులన్నిటినీ ఆదాల క్లియర్‌ చేసుకున్నారు. సుమారు రూ.43 కోట్లకు క్లియరెన్స్‌ వచ్చింది. శుక్రవారం టీడీపీ అభ్యర్థిగా  ఆదాల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రూ.43 కోట్లు కంపెనీ ఖాతాలో జమయ్యాయని మొబైల్‌కు మెసేజ్‌ రాగానేవెంటనే ప్రచారం అర్ధాంతరంగా ముగించేసి అర్జెంట్‌గా సీఎం చంద్రబాబు అమరావతికి రమ్మంటున్నారంటూ బయల్దేరారు. అప్పటి నుంచి ఆయన ఎవ్వరికి అందుబాటులోకి రాకుండా ఉన్నట్టు సమాచారం. టీడీపీ నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఫోన్‌ స్విచాఫ్‌లో ఉంది. వైసీపీ సీనియర్ నేతలతో మాట్లాడిన ఆదాల ఇవాళ జగన్ ను కలవనున్నట్టు సమాచారం. మరోవైపు ఆయనను ఆపేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన అందుబాటులోకి రాకుండా ఉన్నట్టు సమాచారం.

Related posts