telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చేదోడు పథకంపై అచ్చెన్నాయుడు విమర్శలు

ache Naidu tdp

కులవృత్తుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఈరోజు ‘చేదోడు’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ పథకంపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ఇది జగనన్న చేదోడు పథకం కాదని… జగన్ చేతివాటం పథకమని చెప్పారు. సంక్షేమం పేరుతో నాయీ బ్రాహ్మణ, రజక, దర్జీలను జగన్ మోసం చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు.

రాష్ట్రంలో మొత్తం 5.50 లక్షల మంది నాయీ బ్రాహ్మణులు ఉంటే, కేవలం 38 వేల మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. 15 లక్షల మంది రజకులు ఉంటే కేవలం 82,347 మందికి సాయం చేయడం ఏంటని నిలదీశారు. 13 లక్షల మంది దర్జీలు ఉంటే కేవలం 1,25,926 మందికి మాత్రమే లబ్ధిని చేకూర్చడం అన్యాయమని దుయ్యబట్టారు.

Related posts