telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

టీసీఎస్ ఉద్యోగులకు .. భారీగా జీతాలు.. 100మందికి కోటిపైనే..

tcs providing 1cr more salary to employees

ఐటి దిగ్గజ సంస్థ టిసిఎస్‌(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌) ఉద్యోగుల ఏడాది జీతాలకు సంబంధించి ఒక పత్రికా సంస్థ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. టిసిఎస్‌లో 100మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక జీతం అందుకుంటున్నట్లు తెలిపింది.

వీరిలో దాదాపు 25 శాతం మంది ఉద్యోగులు ఆ సంస్థలోనే కెరీర్‌న ప్రారంభించిన వారు కావడం విశేషం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 91 మంది ఉద్యోగులు రూ.కోటి కంటే ఎక్కువ జీతాలు అందుకున్నారు. 2018-19 సంవత్సరానికి ఈ సంఖ్య 103కి చేరింది. సిఇవి రాజేశ్‌ గోపినాథన్‌, సిఒఒ ఎన్జీ సుబ్రహ్మణ్యం, విదేశాల్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌లను కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. టిసిఎస్‌లో రూ.కోటి జీతం అందుకుంటున్న వారిలో అత్యధిక వయస్కులు 72 ఏళ్ల ఉద్యోగి కాగా, అతితక్కువ వయస్కులు 40లలో ఉన్నారు.

ఇన్ఫోసిస్‌లో ఇలా రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 60గా ఉంది. స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు అనుగుణంగానూ తమ ఉద్యోగులకు టిసిఎస్‌ ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ ఇస్తుండగా, ఇన్ఫోసిస్‌ అలా ఇవ్వడం లేదు.

Related posts