telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

టయోటా సరికొత్త ఆఫర్.. అన్ని మోడల్స్‌ కార్ల పై డిస్కౌంట్

car tayota

ఆటోమోబాయిల్  రంగంలో దూసుకుపోతున్న టయోటా అన్ని మోడల్స్‌ కార్ల పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ నెల చివరి వరకు దాదాపు అన్ని మోడల్స్‌పై సంస్థ 1.90లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తోంది. ముఖ్యంగా ఇటియోస్, యారీస్, ఆల్టిస్, ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చునర్ మోడల్స్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ కొనసాగనుంది.

కొన్ని నెలల నుంచి కార్ల కొనుగోళ్లు మందగించడంతో ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి ఆయా కార్ల యాజమాన్య సంస్థలు. ఇందులో భాగంగా ఎక్సేంజి బోనస్, కార్పోరేట్ బోనస్, లాయాల్టీ బోనస్‌ల పేరుతో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫార్చునర్ కార్లపై ఒక లక్ష వరకు ఎక్సేంజ్ బోనస్ లభించనుంది.

Related posts