telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఐటీ రిటన్ దాఖలు.. గడువు పెంపు..

tax return date extended upto august 31

ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది. ‘ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐటీఆర్‌ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా.. రిటర్నులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి.

Related posts